- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు మంత్రుల అనధికారిక కేబినెట్ భేటీ.. రైతు భరోసా, విత్తనాల పంపిణీపై కీలక చర్చ!
by Kema Shiva Kumar |
రేపు తెలంగాణ సెక్రటేరియట్‌లో మంత్రుల అనధికారిక కేబినెట్ భేటీ జరగనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సచివాలయం (Secretariat) వేదికగా రేపు మంత్రుల అనధికారిక కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షేమమే ప్రధాన అజెండాగా ఈ ఉన్నత స్థాయి సమావేశం సాగనుంది. రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Raithu Bharosa) నిధుల విడుదల తేదీపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా ప్రస్తుత సీజన్‌లో భూసారాన్ని కాపాడేందుకు పంటల మార్పిడి విధానం, రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాల ఎంపిక (Seeds Selection, విత్తనాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం వంటి కీలక వ్యవసాయాధారిత అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ సమావేశంలో భాగంగా ఆయా శాఖల పనితీరు, ప్రస్తుత ప్రగతిపై మంత్రుల నుంచి ప్రభుత్వం నివేదికలను (Reports) తీసుకోనుంది.
Next Story






