- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే భారాస పార్టీ అధికారంలోకి రావాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భారాస కార్యకర్తలపై కేసు పెట్టిన ప్రతి ఒక్క అధికారిని గుర్తుంచుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, మిర్యాలగూడ రూరల్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మిర్యాలగూడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని ఎస్‌ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితాల నుంచి ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో అనుసరించిన విధానాలనే తెలంగాణలోనూ అమలు చేసి అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని, ఆ పార్టీ నేతల వ్యాఖ్యల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోందని అన్నారు. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల తయారైన హైబ్రిడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి ఉద్యోగాలు కల్పించాలని, లేకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు వసూళ్ల రాజకీయాలు సాగుతున్నాయని, బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేస్తున్న శాఖ పోలీసు శాఖ మాత్రమేనని, అయితే అది కూడా అధికార పార్టీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తోందని , బిఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడానికి మాత్రమే పనిచేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై నమోదు చేసిన తప్పుడు కేసులను పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎత్తివేస్తామని, అక్రమంగా కేసులు నమోదు చేసిన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేశారు..
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో మళ్లీ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపించాలంటే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కలిసి పనిచేశారని, ఈ ఘటనతో రెండు పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం బహిర్గతమైందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయసింహారెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ఎడవల్లి శ్రీనివాస్‌రెడ్డి, పిల్లుట్ల బాబయ్యతో పాటు వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






