- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటకాలు ఆపండి.. టెలిగ్రామ్ నిషేదంపై రాహుల్ గాంధీ ఫైర్
జూన్ 21న నీట్ పరీక్ష ఉండటంతో టెలిగ్రామ్ పై తాత్కాలికంగా నిషేదం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. నాటకాలు ఆపి ముందు పేపర్ లీకేజీ మాఫియాను దెబ్బకొట్టాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: జూన్ 21న నీట్ పరీక్ష ఉండటంతో టెలిగ్రామ్ పై తాత్కాలికంగా నిషేదం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. నాటకాలు ఆపి ముందు పేపర్ లీకేజీ మాఫియాను దెబ్బకొట్టాలని అన్నారు. పేపర్ లీకేజీకి కారణమైన నెట్ వర్క్ లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇది అనుచితమైనదని, అసలు ఎలాంటి ప్రభావం చూపించదని రాహుల్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఎక్కువగా ఉపయోగించే ఒక యాప్ పై నిషేదించడం వల్ల పేపర్ లీకేజీ సమస్య పరిష్కారం కాదని చెప్పారు. టెలిగ్రామ్ పై నిషేదం విధించడం దొంగను పట్టుకోవడానికి బదులుగా బాధితుడి తలుపులకు తాళం వేయడంలా ఉందని ఎద్దేవా చేశారు.
లక్షలాది మంది విద్యార్థులు నోట్స్ పంపుకునేందుకు, పరీక్షల గురించి చర్చించేందుకు, పరీక్షలకు సిద్దం అయ్యేందుకు కొన్ని సంవత్సరాలుగా టెలిగ్రామ్ పై ఆధారపడ్డారని అన్నారు. టెలిగ్రామ్ పై నిషేధం విధించడం పేపర్ లీకేజీకి పరిష్కారంగా చూడలేమని స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి విద్యార్థికి కూడా ఈ విషయం తెలుసని, పేపర్ లీక్ మాఫియాకు కూడా తెలుసు అంటూ విమర్శించారు. తరవాత నిషేదం ఎవరిపై ఉంటుంది వాట్సాప్ పైనా? అంటూ ప్రశ్నించారు. సమస్యకు మూలకారణానాన్ని గుర్తించకుండా కంటికి కనిపించే భద్రతా చర్యలపైనే ప్రభుత్వం ఫోకస్ చేస్తోందని విమర్శించారు. క్వశ్చన్ పేపర్లను విమానాల్లో పంపిస్తారు.. విద్యార్థుల జేబులు కత్తింరించి కూడా తనిఖీలు చేస్తారు కానీ సమస్యకు మూలకారణమైన లీకేజీ మాఫియాపై ఒక్క దెబ్బ కూడా పడదు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి విద్యార్థుల గొంతు వినాలని లేకపోతే యువతలో ఆగ్రహం పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు.






