- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బార్ అసోసియేషన్ క్లర్క్ కు న్యాయవాది ఆర్థిక సాయం
by velandi.Saikiran |
బార్ అసోసియేషన్ క్లర్క్ కు న్యాయవాది ఆర్థిక సాయం అందజేశారు.

X
దిశ, కరీంనగర్ లీగల్ : కరీంనగర్ బార్ అసోసియేషన్ క్లర్క్ గా పని చేస్తున్న ఆరెల్లి సాగర్ గౌడ్ కు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ సుంకే దేవకిషన్ బుధవారం న్యాయవాదుల వద్ద సేకరించిన ఆర్థిక సాయం రూ. 42,016 లు అందజేశారు. మే 30వ తేదీన సాగర్ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామం వద్ద ఫిట్స్ వచ్చి బండిపై నుంచి కింద పడి పోయాడు. ఈ తరుణంలోనే గాయపడ్డ సాగర్ కు బార్ అసోసియేషన్ లోని కొంత మంది న్యాయవాదులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం అందించగా వాటిని బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ సుంకే దేవకిషన్ సాగర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా దేవకిషన్ మాట్లాడుతూ సాగర్ కు ఆర్థిక సహాయం చేసిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






