- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పానీపూరి ఘటనతో అప్రమత్తమైన అధికారులు
కేసీఆర్ నగర్‌లో పానీ పూరీ తినడం వల్ల కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

దిశ, తంగళ్లపల్లి: తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్‌లో పానీ పూరీ తినడం వల్ల కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి, అవసరమైన వారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మందులను పంపిణీ చేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెల్ అల్ఫ్రెడ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేంద్ర బాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ కేసీ ఆర్ నగర్ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
అధికారులు పరిశుభ్రత, తాగునీటి వనరులను పరిశీలించి, ప్రజలకు తప్పనిసరిగా స్వచ్ఛమైన తాగునీటిని ఉపయోగించాలని సూచించారు. ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపే వినియోగించాలని అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని సూచించారు. స్థానిక వార్డు సభ్యురాలు రోజాతో పరిసరాల పరిశుభ్రత, డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన పారిశుద్ధ్య చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఈఓ బాలయ్య, హెచ్‌ఎస్ ప్రమీల, సతీష్ కుమార్, ఎంఎల్‌హెచ్‌పీ ఆరీఫ్, నవీన్, సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






