ఫైమా జాతీయ కార్యదర్శిగా డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి

by Ajay Maddhiboyina |

ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ జూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్యదర్శి పదవికి ఎంపికయ్యారు.

ఫైమా జాతీయ కార్యదర్శిగా డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ జూడా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రకాంత్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన జాతీయ కార్యదర్శి పదవికి ఎంపికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్ల హక్కుల రక్షణకు, దేశవ్యాప్తంగా వైద్య రంగంలోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే ఫైమా జాతీయ కమిటీలో చంద్రకాంత్ రెడ్డికి కీలక బాధ్యతలు దక్కడం పట్ల వైద్య వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రకాంత్ రెడ్డికి ఫైమా జాతీయ అధ్యక్షుడు డా. శ్రీనాథ్ దుబ్యాల, పలువురు వైద్యులు, జూడా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో ఫైమా మరింత బలోపేతం కావాలని, వైద్య సమాజానికి ఆయన నిరంతర సేవలు అందిస్తూ, ఈ కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Next Story