- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హర్మూజ్ వద్ద ఆంక్షలు వద్దు.. భారత నావికుల భద్రతే మాకు ముఖ్యం: మోడీ
హర్మూజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల నేతల సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: హర్మూజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు ఉండొద్దని ప్రధాని మోడీ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 దేశాల నేతల సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయ్యారు. భేటీలో మోడీ మాట్లాడుతూ.. హర్మూజ్ వద్ద వాణిజ్యం స్వేచ్ఛగా జరగాలని అన్నారు. వేలాది మంది భారతీయ నావికులు అక్కడ పనిచేస్తున్నారని వారి భద్రతే మాకు ముఖ్యం అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ కృషి చేశారని, హర్మూజ్ తెరవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు జరిగిందన్నారు. రెండు దేశాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం జరుగుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తాము భారత్ కు అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధికారంలో ఉన్నంతవరకు భారత్ తో స్నేహం కొనసాగుతుందని చెప్పారు. భారత్ పై ఎవరైనా దాడికి పాల్పడితే అండగా ఉంటుందని అన్నారు. బేరసారాల్లో మోడీ నిక్కచ్చిగా ఉంటారని, ఆయన పెట్టుబడుల విషయంలో సహకరిస్తున్నారని చెప్పారు. నేవీ సిబ్బంది భద్రత విషయంలో భారత్ తో కలిసి పనిచేస్తామని అన్నారు.






