ట్రాక్టర్ విడిభాగాల దొంగలు అరెస్ట్..

by Kodari Anjali |

జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ విడిభాగాలు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.

ట్రాక్టర్ విడిభాగాల దొంగలు అరెస్ట్..
X

దిశ, అశ్వారావుపేట: జల్సాలకు అలవాటు పడి ట్రాక్టర్ విడిభాగాలు చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు పోలీసులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. బుధవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ పింగళి నాగరాజు వివరాలు వెల్లడించారు. ఏపీ ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెంకు చెందిన కట్టూరి సుందర బాబు అశ్వారావుపేట మండలం నారాయణపురంకు చెందిన జక్కుల చిన్ని, నరదల ప్రసాద్ అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి, గత కొంతకాలంగా పార్క్ చేసివున్న ట్రాక్టర్‌ల విడుభాగాలను చోరీలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెల 13న నారాయణపురంలో బత్తుల నాగేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్ ట్రక్కు చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బుధవారం అశ్వారావుపేట పాపిడిగూడెం రోడ్డు శివారులో పోలీసుల వాహన తనిఖీలలో నిర్వహిస్తుండగా, చోరీ చేసిన ట్రక్కును సత్తుపల్లిలో అమ్మేందుకు తీసుకువెళ్తూ, నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో పట్టుబడిన ట్రక్కుతో పాటు మరో ట్రాక్టర్ ట్రైలరు డబల్ బ్లేడ్ డిస్క్ లను కూడా దొంగిలించినట్లుగా అంగీకరించారు. వాటిని నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితులను దమ్మపేట కోర్టు మెజిస్ట్రేట్ ముందు రిమాండ్ నిమిత్తం హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ యాయాతి రాజు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story