తాను బోధించే పాఠశాలలోనే కుమార్తె ప్రవేశం..

by Kodari Anjali |

తండ్రి బోధించే ప్రభుత్వ పాఠశాలలోనే తన కూమార్తెనను చేర్పించి.. భుత్వ పాఠశాలల పట్ల సమాజంలో మరింత నమ్మకం పెంపొందించేలా చేశాడు.

తాను బోధించే పాఠశాలలోనే కుమార్తె ప్రవేశం..
X

దిశ, నడిగూడెం: ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో మరింత నమ్మకం పెంపొందించేలా రామాపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బండ్ల కొండలు తన కుమార్తె బండ్ల రోహితను తాను విధులు నిర్వహిస్తున్న పాఠశాలలోనే ఐదో తరగతిలో చేర్పించారు. ఉపాధ్యాయుడిగా తాను బోధిస్తున్న పాఠశాలలోనే తన కుమార్తెకు ప్రవేశం కల్పించడం పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బి. వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు తదితర సౌకర్యాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గోపయ్య, వార్డు సభ్యుడు వీరభద్రం పాల్గొన్నారు.

Next Story