కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం

by Vemula.Srinu Prasad |

విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధిలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్లసాయి మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది.జ..

కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ కృష్ణలంక పీఎస్(Vijayawada Krishnalanka Police Station) పరిధిలో రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ(Gade Saikrishna) అలియాస్ పిల్లసాయి మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నెల రోజుల క్రితం ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయి కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి సాయికృష్ణ కనిపించకుండా పోయారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందనేదే ఇక్కడ సస్పెన్స్‌గా మారింది. సాయికృష్ణ గురించి పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసులే చంపేశారు: సాయికృష్ణ తల్లి

తమ కుమారుడు గాదె సాయికృష్ణను పోలీసులే చంపేశారని, ఆ విషయాన్ని స్థానిక సీఐనే చెప్పారని తల్లి ఆరోపిస్తున్నారు. తన కొడుకు చచ్చాడని.. స్టేషన్‌కు రావొద్దన్నారని సీఐ చెప్పాడని ఆమె తెలిపారు.

ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

మరోవైపు ఈఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సమావేశం నిర్వహించారు. గాదె సాయికృష్ణ ఘటనపై చర్చించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీని ఛేదించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Next Story