పచ్చనోటుకు కాదు.. అభివృద్ధికి ఓటు వేయాలి

by Kodari Anjali |

పచ్చనోటుకు కాకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకురాలు మురారి స్మితా కోటేష్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

పచ్చనోటుకు కాదు.. అభివృద్ధికి ఓటు వేయాలి
X

దిశ, సికింద్రాబాద్: పచ్చనోటుకు కాకుండా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకురాలు మురారి స్మితా కోటేష్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు తార్నాక డివిజన్ పరిధిలోని కింటీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడూ ఓటరుగా నమోదు కావాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Next Story