నగరంలోని గచ్చిబౌలిలో కలకలం.. ఫుడ్ కోర్టులో గన్‌తో ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్

by Kema Shiva Kumar |

తిన్నతిండికి అయిన బిల్లును తగ్గించాలంటూ ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఏకంగా హోటల్ నిర్వాహకులపై గన్ గురిపెట్టాడు.

నగరంలోని గచ్చిబౌలిలో కలకలం.. ఫుడ్ కోర్టులో గన్‌తో ఏఆర్ కానిస్టేబుల్ హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్, బాధ్యత మరిచి తుపాకీతో హల్‌చల్ చేయడం ప్రజలను తీవ్ర భయాందోళకు గురిచేసింది. కేవలం తిన్న తిండికి బిల్లు తగ్గించలేదనే నెపంతో సదరు కానిస్టేబుల్ గన్ (Gun) తీసి బెదిరింపులకు దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివేక్ (Vivek) అనే వ్యక్తి ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, గచ్చిబౌలిలోని మెమోస్ డిలైట్ (Memos Delight) ఫుడ్ కోర్టుకు వెళ్లిన కానిస్టేబుల్ వివేక్ అక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాడు. తిన్న తర్వాత వచ్చిన బిల్లును చూసి, తనకు బిల్లు తగ్గించాలంటూ ఫుడ్ కోర్టు యజమానితో వాగ్వాదానికి దిగాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గురైన కానిస్టేబుల్ వివేక్.. తన వద్ద ఉన్న సర్వీస్ గన్‌ను బయటకు తీశాడు. యజమానిపైకి గన్ గురిపెట్టి, కాల్చేస్తానంటూ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. ఈ షాకింగ్ ఘటనతో అక్కడున్న కస్టమర్లు అంతా భయంతో పరుగులు తీశారు.

రంగంలోకి గచ్చిబౌలి పోలీసులు..

అయితే, కానిస్టేబుల్ వివేక్ గన్ బెదరింపులపై ఫుడ్ కోర్టు యజమాని వెంటనే స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు, బాధితుడి నుంచి ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story