చెత్తను బయో మైనింగ్ చేయడానికి యంత్రాలు

by Taduka Kalyani |

గత ఆరు సంవత్సరాల నుండి నర్సాపూర్ మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో బయోమైనింగ్ చేయడానికి ఏజెన్సీ నుండి యంత్రాలను తీసుకురావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ వెల్లడించారు.

చెత్తను బయో మైనింగ్ చేయడానికి యంత్రాలు
X

దిశ, నర్సాపూర్ : గత ఆరు సంవత్సరాల నుండి నర్సాపూర్ మున్సిపాలిటీలో పేరుకుపోయిన చెత్తను శాస్త్రీయ పద్ధతిలో బయోమైనింగ్ చేయడానికి ఏజెన్సీ నుండి యంత్రాలను తీసుకురావడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం బయో మైనింగ్ కొరకు అమర్చే యంత్రాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెత్తను బయో మైనింగ్ చేయడం కొరకు కావలసిన ఈ పద్దతిలో ఇన్ని సంవత్సరాల నుండి డంపింగ్ యార్డ్ లో వేసిన చెత్తను పూర్తిగా బయోసాయిల్, ఇతర వ్యర్థాలను వేరు చేసి ఆ వ్యర్థాలను సిమెంట్ ఫ్యాక్తరీలకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ పద్ధతి ద్వారా నర్సాపూర్ డంపింగ్ యార్డ్ పూర్తిగా శుభ్రం చేయబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ శ్రీకాంత్, సానిటరీ ఇన్స్పెక్టర్ మురళి,వార్డు అధికారి ఉదయ్ కుమార్ పాల్గొనడం జరిగింది.

Next Story