రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి

by Kodari Anjali |

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో దొందు దొందేనని తమిళనాడు ఇన్చార్జి రాష్ట్ర బిజెపి నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది: పొంగులేటి సుధాకర్ రెడ్డి
X

దిశ, సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనలో దొందు దొందేనని తమిళనాడు ఇన్చార్జి రాష్ట్ర బిజెపి నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వేంసూరు మండలం ఎర్రగుంటపాడు వద్ద బుధవారం కేంద్రంలో మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా తల్లి పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ హైవేపై మొక్కలు నాటిన తమిళనాడు రాష్ట్ర ఇంచార్జి బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీ లు 420 అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ భృతి కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన విధ్వంసకాండ పాలన కొనసాగుతుందని కాంట్రాక్టర్ల దోపిడి పాలన లేదా కాంట్రాక్టుల పేరు చెప్పి మంత్రుల వ్యవహార శైలి రోజుకొకటి బొగ్గు గనుల కేటాయింపుల పేరుతో సింగరేణిలో బుగ్గుపాడు భూముల అప్పగింతల పేరుతో అవినీతి అక్రమాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాక్షసి పాలన దోపిడి పాలన నడుస్తుందని తెలిపారు.

రైతు భరోసా కల్పిస్తూ...

ఇంతకీ ముందు పాలించిన బీఆర్ఎస్ పాలన అప్పుల పాలన కొనసాగించింది. పాలనలో దొందు...దొందే.. లా ఒకటి బొమ్మ అయితే.. రెండు బొరుసు. బొమ్మా బొరుసు లా కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలను కొనసాగుతుంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, రైల్వే లైన్ ఏర్పాటు పనులకు రైతు సంక్షేమం, రైతు భరోసా కల్పిస్తూ 25 కోట్ల పేదలను దారిద్రులకు దిగువున ఉన్న పేదలను అభివృద్ధి చేసిన ఘనత కేంద్రంలో మోడీ ప్రభుత్వానిదే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపలేదని ఆయన ఆరోపించారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కేంద్ర ప్రభుత్వం చొరవ తో సాధ్యమైంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం అంతా తానే చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవసరానికి మించి ప్రచారం చేసుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో..

ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మంత్రి తుమ్మల రాష్ట్ర మంత్రి గ తన బాధ్యత తను నెరవేర్చారు తప్ప గ్రీన్ ఫీల్ ఎగ్జిట్ లో ఏర్పాట్లు కేంద్ర మంత్రి నితిన్ గట్కరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి అని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో ఎన్నడు జరగని అభివృద్ధి 12 ఏళ్ల మోడీ పాలనలో కొనసాగిందని రాబోయే రోజుల్లో తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారం చేపట్టబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలలో జిల్లా నాయకులు బిజెపి నెల్లూరు కోటేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి నంబూరు రామలింగేశ్వరరావు, సత్తుపల్లి వేంసూరు పెనుబల్లి మండలాలకు చెందిన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Next Story