- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క కంటిలోనే దృష్టిలోపం.. కొత్త చికిత్సా విధానాన్ని కనుగొన్న పరిశోధకులు!
సాంప్రదాయ చికిత్సలైన ఐ ప్యాచ్‌లు, సర్జరీల ద్వారా సమస్య పరిష్కారం కానప్పుడు ఏం చేయాలనే కొత్త కొత్త చికిత్స విధానంపై పరిశోధకులు ఫోకస్ చేశారు.

దిశ, ఫీచర్స్ : పైకి రెండు కళ్లూ బాగానే అనిపిస్తాయి. పైకి చూస్తే ఏ లోపమూ లేదనిపిస్తుంది. కానీ కంటి చూపులో కాస్త తేడా ఉంటుంది. అలా ఉందని కూడా బాధితులు చాలా వరకు గమనించకలేపోతారు. ముఖ్యంగా ఈ దృష్టి లోపం పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనినే ‘లేజీ ఐ’ లేదా అంబ్లియోపియా (బలహీన కంటి సమస్య) అంటారని కంటివైద్య నిపుణులు అంటున్నారు. ఒక కంటి నుంచి వచ్చే సిగ్నల్స్‌ను మెదడు సరిగ్గా ప్రాసెస్ చేయకపోవడంవల్ల ఆ కంటి దృష్టి బలహీనమవుతుంది. దీంతో మరో కంటిని మెదడు ఎక్కువగా ఉపయోగిస్తుంది. బలహీనంగా ఉండే కన్ను సాధాణంగా కనిపించినా మరో కన్నుతో పోలిస్తే దృష్టి తక్కువగా ఉంటుంది. దీనిని చిన్నప్పుడే అంటే ఏడేండ్లలోపు గుర్తించి చికిత్స చేస్తే మెరుగవుతుంది. అయితే మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకులు పిల్లలతోపాటు పెద్దల్లో కూడా సులభంగా తగ్గించగల కొత్త పద్ధతిని కనుగొన్నారు. అదేమిటో చూద్దాం.
కళ్లమధ్య అసమతుల్యత
వైద్య నిపుణులు సాంప్రదాయ చికిత్సలైన ఐ ప్యాచ్‌లు, ఐ డ్రాప్స్ లేదా సర్జరీల ద్వారా కళ్లమధ్య ఉన్న అసమతుల్యతను సరిచేయడానికి ప్రయత్నిస్తారు. కానీ పెద్దల్లో ఇది పూర్తిగా సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు. కొన్నిసార్లు విఫలం అవుతూ ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు కొత్త చికిత్స విధానంపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా బ్రెయిన్ విజువల్ ఇన్ఫర్మేషన్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని లక్ష్యంగా చేసుకుని అంబ్లియోపియా ఉన్న ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. బలహీన కంటి రెటినాకు టెట్రోడోటాక్సిన్(a powerful neurotoxin)తో తాత్కాలికంగా అనస్థీషియా ఇచ్చారు. ఆ తర్వాత కేవలం రెండు రోజుల రెటినా ఇనాక్టివిటీ(Inactivity) తర్వాత, మెదడు విజువల్ కార్టెక్స్‌లో విజువల్ రెస్పాన్స్‌లు పునరుద్ధరించబడ్డాయి.
విజువల్ సర్క్యూట్‌లలో మార్పు
తాజా ప్రక్రియలో బలమైన కంటిని దెబ్బతీయకుండానే, బలహీన కన్నుకు-మెదడుకు మధ్య కనెక్షన్‌ను ‘రీబూట్’ చేసి ఫంక్షన్‌ను పునరుద్ధరించగలిగారు పరిశోధకులు. మార్క్ బేర్ ల్యాబ్‌లో జరిగిన ఈ దీర్ఘకాలిక పరిశోధన రెటినా సిగ్నల్స్‌ను ప్రభావితం చేయడం ద్వారా విజువల్ సర్క్యూట్‌లను మార్చే న్యూరల్ యాక్టివిటీస్ ఏర్పడతాయని చూపించింది. అంటే తాజా పరిశోధన దృష్టి లోపం ఉన్న కంటిని మాత్రమే టార్గెట్ చేసుకొని దానిని సరించడంలో సక్సెస్ అయింది. పైగా ఈ ప్రయోజనాలు నిర్దిష్ట టి-టైప్ కాల్షియం ఛానెల్స్‌పై ఆధారపడి ఉంటాయని నిర్ధారించింది. ఇన్వేసివ్ అండ్ ఎలుకల్లో మాత్రమే పరీక్షించబడినప్పటికీ భవిష్యత్తులో మానవుల్లోనూ ఇది సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






