- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12మందిపై కేసు
హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. 12 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. 12 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీడీఎస్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను బీడీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ర్యాగింగ్ చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ కింద సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాకుండా ర్యాగింగ్ కు పాల్పడిన వారిని మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. ర్యాగింగ్ పై నిషేదం విధించినప్పటికీ కొంతమంది విద్యార్థులు దానిని కొనసాగించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కాలేజీల్లో కొన్ని ర్యాగింగ్ ఘటనలు వెలుగులోకి వస్తున్నా చాలా వరకు అసలు బయటకు రావడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో యాజమాన్యాలు సైతం ర్యాగింగ్ భూతాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.






