- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance Jio: జియో ఐపీఓపై స్పష్టత
ఈ నెల 19న నిర్వహించనున్న ఆర్ఐఎల్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై యాజమాన్యం స్పష్టత ఇస్తుందని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)కు చెందిన టెలికాం విభాగం జియో ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ నెల 19న నిర్వహించనున్న ఆర్ఐఎల్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై యాజమాన్యం స్పష్టత ఇస్తుందని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో లిస్టింగ్‌కు సంబంధించిన కాలపరిమితి, వాల్యుయేషన్, భారతీయ మార్కెట్‌కే పరిమితమా లేదా అంతర్జాతీయ లిస్టింగ్ అవకాశాలున్నాయా వంటి అంశాలపై సంకేతాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలోనే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించవచ్చని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఐపీఓ నుంచి కంపెనీ దాదాపు 4 బిలియన్ డాలర్లు(రూ. 38-40 వేల కోట్లు) సమీకరించనుంది. అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్లు, కొత్త ఇంధన వ్యాపారాలు, మూలధన కేటాయింపు విధానం, రుణ తగ్గింపు, డివిడెండ్ పాలసీ, టెలికాం టారిఫ్ వ్యూహం వంటి అంశాలపై కూడా ఏజీఎంలో వెల్లడించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. జామ్‌నగర్‌లో మెటాతో కలిసి అభివృద్ధి చేస్తున్న 168 మెగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.






