- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని అన్నదాతలకు ఊరట.. ‘రైతు భరోసా’ నిధుల విడుదలపై కీలక ప్రకటన
రైతులకు ఉచిత విత్తనాలు, 7 రకాల పంటలకు అదనపు బోనస్ ఇచ్చే యోచనతో ప్రభుత్వం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పింది. ఈ నెల 26 నుంచి ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ సెక్రటేరియట్‌లో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. రాబోయే సాగు సీజన్‌లో రాష్ట్రంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎన్ని రకాల పంటలు సాగు చేయాలనే అంశంపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 7 రకాల విత్తనాలకు భారీ డిమాండ్ ఉందని తెలిపారు. రైతులకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు, అవసరమైతే ఆ ఏడు రకాల పంటలకు అదనపు బోనస్ ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై ఒకటి 2 రోజుల్లోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని వెల్లడించారు. మాన్సూన్ సీజన్ కోసం ఇరిగేషన్ శాఖను ప్రభుత్వం సమాయత్తం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.






