రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందొద్దు

by Taduka Kalyani |

మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందొద్దు అని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రమ్యశ్రీ అన్నారు.

రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందొద్దు
X

దిశ కమ్మర్‌ పల్లి: మండలంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందొద్దు అని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రమ్యశ్రీ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిఎసిఎస్ కమ్మర్ పల్లి లో 200, చౌటుపల్లి లో 100, కోన సమందర్ లో 452 బస్తాల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. ఇప్పటి వరకు 7363 బస్తాలు ఆన్లైన్ ద్వారా ఫర్టిలైజర్ ఆప్ ద్వారా రైతులు బుకింగ్ చేసుకొని తీసుకున్నారని, 2251 మంది రైతులు సూర్య అప్ ద్వారా బుకింగ్ చేసుకొని యూరియా కొనుగోలు చేశారని తెలిపారు.

Next Story