- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాబ్ రాలేదని ఆందోళన వద్దు - మంత్రి సీతక్క
ఉద్యోగ అవకాశాలు పొందిన యువతకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి సీతక్క నియామక పత్రాలను అందజేశారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లే, జిల్లాలోని యువతి యువకులు ఉద్యోగాలలో ఉపాధిలో మొదటి స్థానంలో నిలవాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు లభించని యువత తమ ప్రతిభను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. బుధవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన మెగా జాబ్ మేళా–2026 కార్యక్రమంలో ఉద్యోగ అవకాశాలు పొందిన యువతకు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ ప్రతిభ ఉంటే యువత దీనిలోనైనా రాణించవచ్చని, ఇలాంటి మెగా జాబ్ మేళా కార్యక్రమాలను రానున్న రోజులలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలలో యువత చేరి ఉపాధి పొందాలని, ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడే విధులను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఏటూర్ నాగారం ఏఎస్పి మనన్ భట్, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి,ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్,మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఆసియా షాహిన్, సంబధిత అధికారులు, పలు కంపెనీలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.






