ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను పంపిచండి

by velandi.Saikiran |   (  Updated:2026-06-17 09:12:00  IST  )

నర్సింగరావుపల్లిలో 14 సంవత్సరాల కింద‌ట మూత పడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవం కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పిల్ల‌ల‌ను పంపిచండి
X

దిశ, ధర్మసాగర్: మండ‌లంలోని నర్సింగరావుపల్లి గ్రామంలో 14 సంవత్సరాల కింద‌ట మూత పడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పున: ప్రారంభోత్సవం, ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దీనికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పాఠశాలను పున: ప్రారంభించారు. అంతకు ముందు నర్సింగరావుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతూ 14 ఏళ్ల కింద‌ మూతపడిన మండల ప్రజా పరిషత్ పాఠశాలను తిరిగి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాలలు మూత పడకూడదని వెల్ల‌డించారు. విద్యా శాఖ అధికాతులతో మాట్లాడి వెంటనే పాఠశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

విద్యా శాఖ అధికారులు, గ్రామ ప్రజల సంకల్పం వల్లనే ఈ రోజు పాఠశాలను ప్రారంభించుకుంటాన్నామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలతో పాటు ప్రీ ప్రైమరీ పాఠశాలను కూడా ప్రారంభించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ పాఠశాలలో ప్రీ ప్రైమరీ నుండి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శిభారాణి కుమారస్వామి, డిఈవో, ఎంఈవో, తహసీల్దార్, ఎంపిడివో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాఫ్యాయులు, విద్యార్థులు, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు,మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Next Story