- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోటలో ముమ్మరంగా భూ వినియోగ సర్వే
జిల్లావ్యాప్తంగా నేల, భూ వినియోగ సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది.

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: జిల్లావ్యాప్తంగా నేల, భూ వినియోగ సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ వ్యవసాయ మిషన్‌లో భాగంగా తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ (TGRAC) ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ చేపడుతున్నారు. సర్వే పనుల నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ కంట్రోల్ (QC) బృందం జిల్లాలో తనిఖీలు నిర్వహించింది.
సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని ప్రయోగశాలల్లో విశ్లేషించి డిజిటల్ నేలపటాలను రూపొందించనున్నారు. ఈ సర్వే ద్వారా నేల స్వభావం, భూసారం, మట్టి లోతు తదితర వివరాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో పంటల ఎంపిక, ఎరువుల వినియోగంపై శాస్త్రీయ అవగాహన పెరిగి వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ ఏ.ఎస్. హరీష్, కన్సల్టెంట్ డాక్టర్ బి.ఆర్.ఎం. రావు, సీ.పీ.ఓ శ్రీనివాసరావు, ఎస్.ఓ. రవీందర్ నాయక్, అసిస్టెంట్ సైంటిఫిక్ ఆఫీసర్లు కమలాకర్ రెడ్డి, కోట నరసింహ, ఫీల్డ్ ఆఫీసర్లు గురుస్వామి, మంజునాథ్ పాల్గొన్నారు.






