- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్షణమే యూరియా యాప్‌ను తొలగించాలి : బీఆర్ఎస్ శ్రేణులు
రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో గంట పాటు భారీ ధర్నా నిర్వహించారు.

దిశ, భిక్కనూరు : రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో గంట పాటు భారీ ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని సినిమా టాకీస్ చౌరస్తాలో బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పోవాలి... యూరియా కావాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఎవరైనా అక్కడికి వచ్చి కొరత లేకుండా యూరియా సరఫరా చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
ఆందోళనకారులను నచ్చజెప్పి ధర్నాను విరమింపజేసే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ, యూరియా యాప్‌ను తొలగిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని వారు తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు కొంతసేపు మౌనం పాటించాల్సి వచ్చింది. ధర్నా ప్రారంభమైన గంట తర్వాత ఏడీఏ అపర్ణ, భిక్కనూరు వ్యవసాయ శాఖ అధికారి నాగరాజు ఆందోళన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ, నాకు స్మార్ట్‌ఫోన్ వాడడం రాదు. యాప్ అంటే ఏంటో కూడా తెలియదు. నా దగ్గర ఉన్న సాధారణ ఫోన్‌తో యూరియా బుక్ చేసుకోగలనా అంటూ వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు.
4,002 బస్తాల యూరియా ఉందని చెబుతున్నారు. బుక్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేస్తే రెండు, మూడు నిమిషాల్లోనే 'నిల్' అని చూపిస్తోంది. ఇది ఎలా సాధ్యం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తక్షణమే ఈ యాప్‌ను రద్దు చేసి, గతంలో అమలు చేసిన పాత విధానంలోనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాను విరమించారు.






