- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామాతో రాబోతున్న కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ రిలీజ్ డేట్ ఫిక్స్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కోర్ట్‌రూమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘సత్యవాన్ సావిత్రి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

దిశ, సినిమా: ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు గత కొద్ది కాలంగా బాక్సాఫీస్ వద్ద పెద్దగా అదృష్టం కలిసి రావడం లేదు. గత ఏడాది ఆమె నటించిన చిత్రాలేవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఒక భారీ హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావాలనే పట్టుదలతో కీర్తి సురేష్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఇన్నాళ్లూ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రలతో అలరించిన ఈ బ్యూటీ.. ఈసారి మొదటిసారిగా ఒక పవర్‌ఫుల్ కోర్ట్‌రూమ్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కోర్ట్‌రూమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘సత్యవాన్ సావిత్రి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతో ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇందులో కీర్తి సురేష్ లాయర్ పాత్రలో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మిస్కిన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండటం విశేషం. హార్ట్ బీట్ సిరీస్ ద్వారా గుర్తింపు పొందిన చారుకేష్‌తో పాటు బాల శరవణన్, శిల్పా మంజునాథ్ మధుసూదన్, ఆర్ సుందరరాజన్, బ్రిగిడా, మాలా పార్వతి.ఎ. వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదికకారన్‌పట్టిఎస్.శక్తివేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జీ స్టూడియోస్ సమర్పపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీని జూలై 24న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు నటి కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రంతో కీర్తి సురేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






