- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానాకాలం సాగుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వానాకాలం సాగు సీజన్‌కు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

దిశ, కడ్తాల్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వానాకాలం సాగు సీజన్‌కు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతులకు అవసరమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ముందస్తుగా నిల్వలు ఏర్పాటు చేసి పంపిణీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు మాత్రమే అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పంటల ఎంపిక, ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకం, ఆధునిక సాగు పద్ధతుల పై రైతులకు అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వానాకాలం సాగు విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు శోభారాణి, కవిత, శ్రీనివాస్ గౌడ్, అరుణ, అనిత, రేణుకా చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






