మరోసారి అందాలతో మాయ చేస్తున్న తేజస్వి మదివాడ

by Pulgam srinivas |

గ్రీన్ శారీలో గ్లామర్ షో.. తేజస్విని అందాలకు నెటిజన్లు ఫిదా.

మరోసారి అందాలతో మాయ చేస్తున్న తేజస్వి మదివాడ
X

దిశ, వెబ్ డెస్క్: అందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే భామల్లో తేజస్విని మదివాడ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో చిన్న పాత్రతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన తేజస్విని, ఆ తర్వాత 'కేరింత' సినిమాతో మంచి గుర్తింపును సంపాదించింది.




ముఖ్యంగా ఆ చిత్రంలో తన నటన, అందంతో యువత హృదయాలను గెలుచుకుని ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. 'కేరింత' తర్వాత తేజస్విని కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని చాలామంది భావించారు.




అయితే అనూహ్యంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఈ బ్యూటీకి అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. షో అనంతరం కూడా భారీ సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాకపోవడంతో ప్రస్తుతం టీవీ, ఓటీటీ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.




ఇక సోషల్ మీడియాలో మాత్రం తేజస్విని తన గ్లామర్‌తో అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా గ్రీన్ కలర్ చీరలో, వైట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో మెరిసిపోయిన ఈ భామ, తన అందాలను హైలైట్ చేస్తూ కెమెరాకు స్టైలిష్ పోజులు ఇచ్చింది.





ఈ ఫోటోల్లో తేజస్విని ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story