ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడు : కల్వకుంట్ల కవిత

by Batti.Sumithra |

ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడని, మన రాష్ట్రం పై పెత్తనం కోసం పక్క రాష్ట్రం నాయకులు చేస్తున్నారని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు.

ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడు : కల్వకుంట్ల కవిత
X

దిశ, గోదావరిఖని : ముఖ్యమంత్రి తెలంగాణ ఇజ్జత్ తీయటమే పనిగా పెట్టుకున్నాడని, మన రాష్ట్రం పై పెత్తనం కోసం పక్క రాష్ట్రం నాయకులు చేస్తున్నారని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ పోరాటం చేస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం బాయిబాటలో భాగంగా గోదావరిఖని 11 ఇంక్లైన్ కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించి ఆమె మాట్లాడారు. సింగరేణిని కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ఎక్కువ బొగ్గు బ్లాకులు కేటాయించాలని, ముఖ్యమంత్రి అప్పులు పుడుతలేవంటాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ఎత్తుత లేడని పడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత బేలగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. అందుకే మన రాష్ట్రం పై పెత్తనం కోసం పక్క రాష్ట్రం నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు. సింగరేణిలో కార్మికుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తే మమ్మల్ని అడ్డుకోవటమేంటన్నారు. కార్మికులకు కనీస అవసరాలు తీర్చకుండా ప్రభుత్వం, ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కార్మికులను కలిసేందుకు వస్తే గేట్లు బంద్ పెట్టి యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను సింగరేణి కార్మికులు కలవద్దా ? కార్మికులకు ఏ పార్టీ వారితో నైనా మాట్లాడే హక్కు లేదా అన్నారు. సింగరేణి యాజమాన్యం పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం సరికాదన్నారు. అసలు సింగరేణి క్యాంపస్ లోకి పోలీసులే రావద్దు. కానీ వాళ్లను తీసుకొచ్చారంటే వీళ్లు ఎంత తప్పు చేసి ఉంటారు అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి, రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు ముందు సింగరేణి కార్మికులతో మీటింగ్ లు పెట్టలేదా అని అడిగారు. ఢిల్లీకి అప్పు కోసం పోతే చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లను చూసినట్లు చూస్తున్నారని అనటం విడ్డూరంగా ఉందన్నారు. అందుకే మన సంపద మనం కాపాడుకునేందుకు మనమంతా మేలుకోవాలన్నారు. సింగరేణి కార్మికులకు కష్టాలపై మాట్లాడాల్సిన ఏఐటీయూసీ మౌనంగా ఉండటం ఏందన్నారు. సింగరేణి డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజ్ లో 25 శాతం సీట్లు కార్మికుల పిల్లలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు మంచి స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. రకరకాల కారణాలతో నేను కొత్తగా పార్టీ పెట్టాల్సి వచ్చిందని, మా పార్టీకి మీ ఆశీర్వాదం కావాలని బాయిబాట కార్యక్రమం ద్వారా ఇక్కడకు వచ్చానన్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీ మద్దతు కావాలని వచ్చానని, మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను మీకోసం పోరాటం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Next Story