- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్నూరు కాపు భవనానికి రూ. 5 కోట్లు నిధులు మంజూరు చేస్తా: మంత్రి పొన్నం
కోకాపేట స్థలంలోని మున్నూరు కాపు భవనానికి త్వరలోనే 5 కోట్లు నిధులు మంజూరు చేస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

దిశ, రవీంద్ర భారతి: కోకాపేట స్థలంలోని మున్నూరు కాపు భవనానికి త్వరలోనే 5 కోట్లు నిధులు మంజూరు చేసి ఈ నెలలోనే ప్రొసీడింగ్స్ ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గంలో కింది స్థాయి కుటుంబాలకు విద్యకు సహకారం అందించాలని ఆయన సూచించారు. తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ లకు రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, గౌరవ అతిథిగా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నూతనంగా మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అల్లం భాస్కర్ లకు బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి.హనుమతరావు అభినందనలు తెలిపారు. బొమ్మ వెంకన్న దగ్గర విద్యార్థి నాయకుడిగా పని చేసిన రోజులు మంత్రి గుర్తు చేశారు.
విద్యకు అధిక ప్రాధాన్యత..
మున్నూరు కాపు సమాజానికి కరీంనగర్, వేములవాడలో సత్రాలు కాచిగూడలో విద్యార్థుల కు హాస్టల్ నిర్మించుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ఇటీవల జరిగిన కులసర్వేలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు పరిశీలిస్తే ఎక్కడైతే మంచి చదువులు చదివారో ఆ కుటుంబాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మున్నూరు కులానికి సంబంధించిన హక్కుల కోసం కొట్లాడతా అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి మున్నూరు కాపు ఐక్యం చేయాలన్నారు. రాజకీయాలు అతీతంగా మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలన్నారు. వీహెచ్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని కులాలకు ప్రాధాన్యత కల్పించి తోడ్పాటును అందిస్తున్నామని తెలిపారు. బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెప్పారు. మున్నూరు కాపు భవనానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు నేతలు శ్యామ్ మోహన్, లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.






