అనకాపల్లి రైతులకు తీపి కబురు.. సాగు నీరు విడుదలపై హోంమంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి రైతులకు హోంమంత్రి వంగలపూడి అనిత గుడ్ న్యూస్ తెలిపారు. అతి త్వరలోనే పోలవరం కాలువ ద్వారా సాగునీరు అందించేందుకు అడుగులు వేస్తున్నామని ఆమె తెలిపారు..

అనకాపల్లి రైతులకు తీపి కబురు.. సాగు నీరు విడుదలపై హోంమంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి రైతుల(Anakapalli Farmers)కు హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minsiter Vangalapudi Anita) గుడ్ న్యూస్ తెలిపారు. అతి త్వరలోనే పోలవరం(Polavaram) కాలువ ద్వారా సాగునీరు(Irrigation water) అందించేందుకు అడుగులు వేస్తున్నామని ఆమె తెలిపారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ‘విజయోత్సవ సభ’లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ద్వారా వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని హోంమంత్రి తెలిపారు.

వారి త్యాగాలు అమూల్యం

జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి భూములిచ్చిన రైతులు, మత్స్యకారుల త్యాగాలు అమూల్యమైనవని వంగలపూడి అనిత కొనియాడారు. వేట నిషేధ భృతిని రూ. 20 వేలకు పెంచడంతో పాటు ఆధునిక వలలు, ఇంజిన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన పాయకరావుపేటతో పాటు యావత్ అనకాపల్లి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. 2019-24 నాటి విధ్వంసకర పాలనలో పరిశ్రమలు లేక, మహిళలకు రక్షణ లేక యువత ఉపాధి కోల్పోతే.. ఈ రెండేళ్లలో మన NDA ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులతో అనకాపల్లి జిల్లా దేశంలోనే నెంబర్ వన్ స్థానం వైపు దూసుకుపోతోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story