- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిషన్ భగీరథ పనుల జాప్యంపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం..
రోడ్ల ధ్వంసం, పైప్‌లైన్ లీకేజీలపై ఎమ్మెల్యే కూనంనేని అధికారులకు చురకలు అంటించారు.

దిశ, పాల్వంచ టౌన్: మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల జాప్యం, తరచూ జరుగుతున్న లీకేజీలు, ధ్వంసమైన రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పైప్‌లైన్ లీకేజీలను వెంటనే అరికట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
వారం రోజుల్లో మరోసారి క్షేత్రస్థాయిలో..
సమస్య తీవ్రతను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.మిషన్ భగీరథ పనుల కోసం తవ్వకాలు చేపట్టి నెలలు గడుస్తున్నా రోడ్ల పునరుద్ధరణ చేపట్టకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారి పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడ వెంటనే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనులు చేపట్టాలని సూచించారు. వారం రోజుల్లో మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షిస్తానని, అప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ శాఖల డీఈలు, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.






