- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి వేడుకకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళలు దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో పెళ్లి ముందస్తు వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు స్పాట్‌లో దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లోని బదౌన్ (Badaun) జిల్లాలో ఇవాళ మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ఒకే కుటుంబానికి చెందిన కొందరు మహిళలు పెళ్లికి ముందు జరిగే ఓ సాంప్రదాయ వేడుకకు హాజరయ్యేందుకు ఈ-రిక్షాను అద్దెకు తీసుకుని వెళ్తున్నారు. వారు బదౌన్ జిల్లా పరిధిలోకి రాగానే రోడ్డుపై వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ను తప్పించబోయిన ఈ-రిక్షా డ్రైవర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయాడు. అదే సమయంలో ఎదురుగా అతివేగంతో దూసుకొస్తున్న మరో ట్రాక్టర్ ఈ-రిక్షాను బలంగా ఢీకొట్టింది. తేలికపాటి వాహనం కావడంతో ఈ-రిక్షా పూర్తిగా నజ్జునజ్జయ్యింది.
ఈ దుర్ఘటనలో నారాయణి (30), ఆర్తి (30), ప్రేమ (32), గంగాశ్రీ అలియాస్ సర్ల (32), రాజు కుమారి (50), రేవతి (80) అనే మహిళలు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు మహిళలతో పాటు ఈ-రిక్షా డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన రెండు ట్రాక్టర్ల డ్రైవర్లపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.






