ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలి : ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలి : ఎమ్మెల్యే
X

దిశ,చేగుంట: ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయని విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని రెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలలేనని అన్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరి నాణ్యమైన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం మౌలిక సదుపాయాలు పరిశుభ్రమైన తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, డిజిటల్ విద్య వంటి అన్ని సౌకర్యాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం అవసరమైన సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని బోధనలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని విద్యార్థులను క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్య వైపు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్ రావు,వార్డు సభ్యులు,అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story