లాలాపేట్ ఫ్లైఓవర్ కింద అక్రమ పార్కింగ్‌లపై మాజీ డిప్యూటీ మేయర్ ఆగ్రహం

by Kodari Anjali |

తార్నాక డివిజన్ పరిధిలో మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు.

లాలాపేట్ ఫ్లైఓవర్ కింద అక్రమ పార్కింగ్‌లపై మాజీ డిప్యూటీ మేయర్ ఆగ్రహం
X

దిశ, సికింద్రాబాద్: తార్నాక డివిజన్ పరిధిలోని లాలాపేట్ ఫ్లైఓవర్ కింద అక్రమ పార్కింగ్‌లు, రోడ్డు ఆక్రమణల కారణంగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఫ్లైఓవర్ కింద అక్రమంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో పాటు రోడ్డు ఆక్రమించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా రహదారులను ఆక్రమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, వెంటనే అక్రమ పార్కింగ్‌లు, ఆక్రమణలను తొలగించాలని సూచించారు. అనంతరం సంబంధిత ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తున్న అక్రమ పార్కింగ్‌లు, రోడ్డు ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Next Story