- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..
సికింద్రాబాద్–జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనది.

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్–జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. కిలోమీటర్ నంబర్ 193/40 సమీపంలోని అప్ లైన్ పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు బుధవారం తెల్లవారుజామున 2.10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా, దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించలేదు. మృతదేహం లభ్యమైన పరిస్థితులను బట్టి, గుర్తుతెలియని కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో రైలు పట్టాలపై పడుకుని ఉండగా గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచారు. మృతుడు సుమారు 5.3 అడుగుల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉండగా, కుడి చేతి మోచేతి పైభాగంలో పుట్టుమచ్చ ఉన్నట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను 8712658581 నంబర్‌లో సంప్రదించి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.






