తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు: ఆ సంస్థలకు షాకిచ్చిన ‘FSSAI’

by Kema Shiva Kumar |

హెల్తీ ప్రొడక్ట్స్ పేరుతో తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్న పలు సంస్థలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) నోటీసులు జారీ చేసింది.

తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు: ఆ సంస్థలకు షాకిచ్చిన ‘FSSAI’
X

దిశ, వెబ్‌డెస్క్: ఫుడ్ బ్రాండ్ల ఫేక్ ప్రచారాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలపై దేశీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) కఠిన చర్యలకు పూనుకుంది. కస్టమర్లను మోసం చేసేలా బ్రాండింగ్, లీడ్ క్లెయిమ్స్ చేస్తున్న సఫోలా (Saffola), కిండర్ జాయ్ (Kinder Joy), రా ప్రెస్సరీ (Raw Pressery) సహా పలు అగ్రశ్రేణి బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. అయితే, సదరు కంపెనీ ఉత్పత్తుల ప్యాకెట్లు, యాడ్స్‌లో చూపిస్తున్న నాణ్యత, పోషక విలువలు నిజానికి వాటిల్లో లేవని FSSAI ఇటీవలే గుర్తించింది. హెల్తీ ప్రొడక్ట్స్, నేచురల్ జ్యూసెస్, పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ప్రత్యేక ఆహార పదార్థాలు అంటూ కంపెనీలు చేస్తున్న ప్రచారంలో శాస్త్రీయ ఆధారాలు లోపించాయని స్పష్టం చేసింది. ఇచ్చిన నోటీసులకు సంబంధించి సదరు కంపెనీలు నిర్ణీత గడువులోగా సరైన వివరణ ఇవ్వవలసి ఉంటుందని.. ఒకవేళ వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాతో పాటు ప్రొడక్ట్ లైసెన్స్ రద్దు చేసే దిశగా చర్యలు ఉంటాయని FSSAI హెచ్చరికలు జారీ చేసింది.

Next Story