- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలపై ఇంటర్మీడియట్ బోర్డు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సప్లిమెంటరీ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లుగా ఇంటర్మీడియట్ విద్యా మండలి (Board of Intermediate Education) అధికారికంగా ప్రకటించింది. రేపు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ఇంటర్ బోర్డ్ అధికారులు ఫలితాలను విడుదల చేయనున్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చూసుకోవడంతో పాటు, ఈ-గవర్నెన్స్ సేవల్లో భాగంగా వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా సులభంగా పొందేలా ఏర్పాట్లు చేసినట్లుగా బోర్డు వెల్లడించింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మే 21 నుంచి జూన్ 4వ వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఇంటర్ బోర్డు అత్యంత పకడ్బందీగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిసిన కొద్ది రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసి రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అప్పుడే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.






