- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలనంగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు : బూడిదైనా ఇవ్వండంటూ తల్లి ఆవేదన
విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. తన కొడుకును సీఐ నాగరాజు చంపేశాడని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. తన కొడుకును సీఐ నాగరాజు చంపేశాడని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్నారు. చేసిందంతా చేసి.. తనకేమీ తెలీదని ఎలా మాట్లాడుతున్నాడని వాపోయారు. తన కొడుకును ముమ్మాటికీ లాకప్ లోనే చంపేశారని, ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తప్పు చేస్తే శిక్షించాలి గానీ.. చంపేసే హక్కెవరిచ్చారని కృష్ణలంక పోలీసులను మీడియా ముఖంగా ఆమె నిలదీశారు. తమకు పార్టీలతో సంబంధం లేదన్న విజయలక్ష్మి.. తన కొడుకు తనకు కావాలని, ఎవరైనా తీసుకొచ్చి చూపించాలని కన్నీళ్లతో వేడుకున్నారు. బ్రతికి ఉంటే కొడుకును చూపించండి.. లేదంటే దహనం చేసిన మట్టైనా ఇవ్వండంటూ గుండెలు బాదుకున్నారు. తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మరోవైపు సాయికృష్ణ మేనమామ కృష్ణలంక పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. సీఐ నాగరాజు, స్టేషన్ సిబ్బంది కలిసి సాయికృష్ణను చంపేశారన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అశోక్, బాబురావు, సుబ్రమణ్యంలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని, న్యాయం కోసమే పోరాడుతున్నామన్నారు. సస్పెండ్ చేయడమంటే వీఆర్ కు పంపడమా? వ్యక్తి మిస్సింగ్ పై కనీస బాధ్యత వహించాల్సిన అవసరం పోలీసులకు లేదా? అని నిలదీశారు. న్యాయం చేయడం చేతకాకపోతే గాజులు వేసుకుని ఇళ్లలో కూర్చోవాలంటూ సాయికృష్ణ మేనమామ ఫైరయ్యారు.






