- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మ్యూజికల్ జర్నీ షురూ.. పోస్ట్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్
ఇది రికార్డింగ్ సెషనా? డ్యాన్స్ సెషనా? లేక రెండునా? ఈ గందరగోళం ముచ్చటగా ఉంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక 40 ఏళ్ల ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్, 20 ఏళ్ల యువతి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాను ఆగస్టు 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఈ సినిమా మ్యూజికల్ జర్నీని ప్రారంభిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ట్యూన్ సిద్ధం చేస్తుండగా, డైరెక్టర్ వెంకీ అట్లూరి ఫోన్ చేసి ఒక మాస్ సింగర్ వస్తోందని చెబుతాడు.
ఆ వెంటనే అక్కడికి హీరోయిన్ మమిత బైజు రావడంతో జీవీ ప్రకాష్ ఆశ్చర్యపోతాడు. ఆమె పాడితే పాట కచ్చితంగా వైరల్ అవుతుందని ఇద్దరూ రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్తారు. అయితే, రికార్డింగ్ సమయంలో పాట పాడకుండా మమిత డ్యాన్స్ చేయడం మొదలుపెడుతుంది. దీంతో డిస్టబెన్స్ అవుతుందని పదే పదే ట్రై చేస్తుంటాడు జీవీ ప్రకాష్. కానీ ఆ శబ్దం చేసేది మమితనే అని తెలుసుకుని షాక్ అవుతాడు. దీంతో ఆమె మంచి స్టూడియో ఉంది కదా, మన సాంగ్‌తో ఒక రీల్ చేద్దామనుకున్నా. అని ట్విస్ట్ ఇస్తుంది. దీంతో జీవీ పాట పాడటానికి వచ్చావు కదా అంటే అది నా డిపార్ట్‌మెంట్ కాదు సార్" అంటూ ఆమె అమాయకంగా సమాధానం ఇస్తుంది. ఈ గందరగోళం చూస్తుంటే, మమిత ఈ సినిమాతో సింగర్‌గా పరిచయం అవుతున్నట్లు హింట్ ఇస్తూనే ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేశారు. "ఇది రికార్డింగ్ సెషనా? డ్యాన్స్ సెషనా? లేక రెండునా? ఈ గందరగోళం ముచ్చటగా ఉంది ఫస్ట్ సింగిల్ ప్రోమో జూన్ 17 రాబోతుంది" అంటూ చిత్రబృందం పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో క్యూరియాసిటీని పెంచుతోంది. కానీ పూర్తి పాట ఎప్పుడు విడుదల కాబోతుందనే విషయాన్ని మాత్రం మూవీ మేకర్స్ సస్పెన్స్‌లో ఉంచారు.






