దిశ ఎఫెక్ట్ : స్పందించిన రెవెన్యూ అధికారులు

by Taduka Kalyani |

దిశ కథనంతో స్పందించిన రెవెన్యూ అధికారులు కుంట్లూరులో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు.

దిశ ఎఫెక్ట్ : స్పందించిన రెవెన్యూ అధికారులు
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : దిశ కథనంతో స్పందించిన రెవెన్యూ అధికారులు కుంట్లూరులో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్ఐ రాంబాబు, సర్వేయర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి సర్వే నంబర్ 24లో సర్వే నిర్వహించి హద్దులు గుర్తించారు. జేసీబీతో గోతులు తవ్వించి హద్దులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ భూమి బోర్డును ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడ తొలగింపునకు మాజీ సర్పంచ్ చామ రాం రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు కొంత మేర గోడను తొలగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Next Story