'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

గతకొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాక్రోచ్ జనతా పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని నెలలుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీపై జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరిట జనసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘చాలాసార్లు మనకుమనం తక్కువ అంచనా వేసుకున్నాం. ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో అందరం చూస్తూనే ఉన్నాం. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకు వస్తోంది. చలి చీమలు కూడా బలమైన పాములను చంపేస్తాయి. ఒక లక్ష్యం పెట్టుకుని.. ఆ లక్ష్యం దిశగా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

అంతకుముందు.. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప.. తనకు ఏ ఆలోచనా లేదని అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో, రాదో కూడా తెలియదన్నారు. కానీ ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలు ఎదుర్కొన్నాము, విజయాలూ సాధించామని చెప్పారు. లక్ష మంది సభ్యత్వంతో ప్రారంభమైన జనసేన, నేడు 20 లక్షలకుపైగా సభ్యత్వాలు వచ్చాయని అన్నారు. అంతేగాకుండా.. తెలంగాణ ఏర్పాటుకు ఏనాడూ జనసేన అడ్డు చెప్పలేదు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం. విభజన విషయంలో కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు.. అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటికీ వారి ధోరణి మారలేదు. జనసేన సభకు అనుమతివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ అని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story