విద్యార్థిని బలవన్మరణం.. ఆరేళ్ల క్రితం తండ్రి మృతి

by Batti.Sumithra |

మండలంలోని ముకమామిడి గ్రామానికి చెందిన ఉమా అనే విద్యార్థిని సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థిని బలవన్మరణం.. ఆరేళ్ల క్రితం తండ్రి మృతి
X

దిశ, ములకలపల్లి : మండలంలోని ముకమామిడి గ్రామానికి చెందిన ఉమా అనే విద్యార్థిని సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉమా అశ్వారావుపేటలోని ఓ హాస్టల్‌లో చదువుకుంటూ ఇటీవల 8వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. కొత్త విద్యా సంవత్సరం 9వ తరగతిలో చేరాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, గ్రామస్థులను కలచివేసింది.

ఉమా తండ్రి వీరాస్వామి సుమారు ఆరు సంవత్సరాల క్రితం ఉరివేసుకుని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుంచి ఆమె తల్లి కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ ఘటన పై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story