- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. కబ్జా భూములపై విచారణకు తహసీల్దార్ ఆదేశం
కొండాపూర్ మండల పరిధిలోని కుతుబ్షాహీపేట, సైదాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ ‘దిశ’ పత్రికలో ఈనెల 11న "కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి" పేరిట కథనం ప్రచురితమైంది.

దిశ, సంగారెడ్డి: కొండాపూర్ మండల పరిధిలోని కుతుబ్షాహీపేట, సైదాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారంటూ ‘దిశ’ పత్రికలో ఈనెల 11న "కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి" పేరిట కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. స్థానిక తహసిల్దార్ అశోక్ ఆధ్వర్యంలో కబ్జా భూములపై విచారణ చేపట్టారు. కబ్జాకు సంబంధించి విచారణ చేసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ తహసీల్దార్ సిబ్బందిని ఆదేశించారు.
కాగా, కుతుబ్షాహీపేటలోని సర్వే నెంబర్ 16, సర్వే నెంబర్ 20 లోని ప్రభుత్వ భూములు ఎంతవరకు ఆక్రమణకు గురైంది అనేది సిబ్బంది విచారణ చేస్తున్నారు. అలాగే సైదాపూర్‌లోని సర్వే నంబర్ 15 లోగల రెండు ఎకరాల భూమిపై కూడా నివేదికను తయారు చేస్తున్నారు. విచారణ అనంతరం వచ్చిన నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుందని తహసీల్దార్ ‘దిశ’తో మాట్లాడుతూ వివరించారు. ఇకపోతే పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కబ్జాకు సంబంధించిన వ్యవహారం పై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.






