వాయుసేన విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం.. ఐదుగురు రక్షణ సిబ్బంది మృతి

by Malleboina Mahesh |

అసోంలోని జోర్‌హట్ ఎయిర్‌బేస్‌లో వాయుసేన AN-32 విమానం ల్యాండింగ్ సమయంలో కూలిన ఘటనలో ఇద్దరు అధికారులు, ముగ్గురు సిబ్బందితో సహా ఐదుగురు మృతి చెందారు.

వాయుసేన విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం.. ఐదుగురు రక్షణ సిబ్బంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అసోంలోని జోర్‌హట్ ఎయిర్‌బేస్ (Jorhat Airbase) వద్ద శనివారం ఉదయం భారత వాయుసేన (IAF) రవాణా విమాన ప్రమాదం కూలిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ అవుతున్న సమయంలో వాయుసేనకు చెందిన AN-32 రకం విమానం (AN-32 aircraft) ఒక్కసారిగా కూలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు రక్షణ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు ఉన్నతాధికారులు

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు వాయుసేన అధికారులు (Officers) కాగా, మిగిలిన ముగ్గురు ఇతర విమాన సిబ్బంది (Crew) ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొక సిబ్బందిని రెస్క్యూ టీమ్స్ తక్షణమే సమీపంలోని సైనిక ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రన్‌వేపై ల్యాండైన తరుణంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే విమానం అదుపుతప్పి కూలిపోయి, మంటల్లో చిక్కుకుందని ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణకు వాయుసేన ఉన్నతాధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. కాగా ఐదుగురు రక్షణ సిబ్బంది మృతిపై వాయుసేన అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.

Next Story