నెల్లూరులో అసత్య ప్రచారాలు.. నిప్పులు చెరిగిన Mla ప్రశాంతిరెడ్డి

by Vemula.Srinu Prasad |

తొలకరి వర్షం పడుతోంది. రైతులు పంటల సాగుకు రెడీ అవుతున్నారు. యూరియాకోసం ఎదురు చూస్తున్నారు. దీంతో నెల్లూరు నగరంలో దుష్ర్రచారాలు వెల్లువెత్తాయి. యూరియా కొరత ఉందని, రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి....

నెల్లూరులో అసత్య ప్రచారాలు.. నిప్పులు చెరిగిన Mla ప్రశాంతిరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తొలకరి వర్షం పడుతోంది. రైతులు పంటల సాగుకు రెడీ అవుతున్నారు. యూరియాకోసం ఎదురు చూస్తున్నారు. దీంతో నెల్లూరు నగరంలో దుష్ర్రచారాలు వెల్లువెత్తాయి. యూరియా కొరత ఉందని, రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి.

దుష్ప్రచారాలపై ఎమ్మెల్యే ఆగ్రహం

దీంతో ఆధికార పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆమె విరుచుకుపడ్డారు. యూరియా విషయంలో వీరిద్దరూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులోనే ఉందని ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరులో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. కోవూరులో నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేరంటాళ్లు మాదిరిగా వెళ్లొచ్చారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విమర్శించారు.

Next Story