- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రకాశ్‌రాజ్‌పై క్రిమినల్ కేసు: మనోభావాలు దెబ్బతీశారంటూ TTD సభ్యుడు ఫైర్
సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో టీటీడీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి(TTD Trust Board member Bhanu Prakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి నాలుగో జిల్లా అదనపు కోర్టు(Tirupati Fourth Additional District Court)లో క్రిమినల్ కేసు(Criminal Case) వేశారు. ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. అనంతరం భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని, మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. తాము పంపించిన నోటీసులకు ప్రకాశ్ రాజ్ నుంచి స్పందన రాలేదని, అందుకే కోర్టులో కేసు వేశామని చెప్పారు. అంతేకాదు ప్రకాశ్ రాజ్‌పై ‘మా’ లోనూ ఫిర్యాదు చేస్తామని, సినిమాల నుంచి నిషేధించాలని కోరతామని భాను ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.






