- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మేడ్చల్ > కూకట్‌పల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు
కూకట్‌పల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు
by Kodari Anjali |
కూకట్‌పల్లి ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

X
దిశ, కూకట్‌పల్లి: వేసవి సెలవులు పూర్తి అయి పాఠశాలలు పునః ప్రారంభం అయిన సందర్భంగా కూకట్‌పల్లి ప్రాంతంలోని ప్రైవేట్ పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎంవిఐ శ్రీనివాస్ బాబు ఆధ్వర్యంలో ఉషాముల్లపూడి రోడ్డులో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీలు నిర్వహించి సరైన పత్రాలు, లైసెన్స్ లేకుండా బస్సు నడుపుతున్న బస్సులను, మోతాదుకు మించి విద్యార్థులను రవాణా చేస్తున్న బస్సులను.. మొత్తం 8 బస్సులను అధికారులు సీజ్ చేశారు. ఇందులో చైతన్య పాఠశాలకు చెందిన బస్సులో మోతాదుకు మించి విద్యార్థులను కూర్చోబెట్టినట్టు అధికారులు గుర్తించారు. అదే విధంగా ఎస్ఆర్ డీజి, జెనెసిస్, విధ్యాంజలీతో పాటు మరికొన్ని పాఠశాలల బస్సులను సీజ్ చేశారు.
Next Story






