- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాక్షన్ మోడ్ నుంచి లవ్‌స్టోరీకి.. స్టార్ డైరెక్టర్ సినిమాలో చాన్స్ దక్కించుకున్న శార్వరి వాఘ్!
యూత్‌ఫుల్ సినిమాలను అందించిన టాప్ డైరెక్టర్ లవ్ రంజన్.. తన తదుపరి చిత్రంలో శార్వరీని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా మారిపోయారు. ఇటీవల ‘మై వాపస్ ఆవుంగా’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ చిత్రం ‘ఆల్ఫా’ లో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌లో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 3న విడుదల కానుండటంతో వచ్చే వారం నుండే ప్రమోషన్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది కాకుండా, సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో ఆమె నటించిన ‘యే ప్రేమ్ మోల్ లియా’ చిత్రం కూడా 2026 చివరిలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, తాజాగా, శార్వరీ ఖాతాలో మరో భారీ ప్రాజెక్ట్ చేరినున్నట్లు వార్తలు వస్తున్నాయి. యూత్‌ఫుల్ సినిమాలను అందించిన టాప్ డైరెక్టర్ లవ్ రంజన్.. తన తదుపరి చిత్రంలో శార్వరీని హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇది లవ్ స్టోరీగా రాబోతుండగా.. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. లవ్ రంజన్ దర్శకత్వంలో కార్తీక్ సరసన నటించే అవకాశం రావడంపై శార్వరీ కూడా ఆసక్తిని కనబరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లవ్ రంజన్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఈ ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమేంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






