- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పు లింగాపూర్‌లో అడ్డాగా శిశు విక్రయాలు.. వరుస ఘటనలతో కలకలం
వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామం శిశు విక్రయాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలో ఇటీవల రెండు శిశు విక్రయాల ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెల్దుర్తి: వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామం శిశు విక్రయాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలో ఇటీవల రెండు శిశు విక్రయాల ఘటనలు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 25 రోజుల క్రితం గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన తండాలో ఓ శిశువును విక్రయించిన ఘటన చోటుచేసుకుంది. అయితే తండా వాసుల ఆగ్రహంతో శిశువును కొనుగోలు చేసిన వ్యక్తులు తిరిగి తల్లిదండ్రులకు అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు ముందే మరో శిశు విక్రయం జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఎరుకల సాయిలు కుమార్తె మమత భర్త చిన్నా 2024లో మృతి చెందడంతో ఆమె తన తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. మమత 2026 ఏప్రిల్ 17న మగ శిశువుకు జన్మనిచ్చింది. తీవ్ర పేదరికం, కుటుంబ పోషణ భారం కారణంగా ఆ శిశువును వెల్దుర్తికి చెందిన వ్యక్తికి ఎరుకల కిష్టయ్య ద్వారా విక్రయించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలల సంరక్షణ బాధ్యత కలిగిన అధికారులు శిశు విక్రయాలు జరిగిన తర్వాత మాత్రమే స్పందిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శిశు విక్రయాల వంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బాధ్యులను శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విచారణలో బాలల సంరక్షణ అధికారి శంకర్ గౌడ్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.






