రిజిస్ట్రేష‌న్ నిషేధిత జాబితాను స‌వరించాలి..

by Kodari Anjali |

ప్రైవేటు భూముల‌ను రిజిస్ట్రేష‌న్ నిషేధిత జాబితా నుంచి విముక్తి క‌ల్పించాల‌ని బిల్డ‌ర్లు మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను అభ్య‌ర్థించారు.

రిజిస్ట్రేష‌న్ నిషేధిత జాబితాను స‌వరించాలి..
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రైవేటు భూముల‌ను రిజిస్ట్రేష‌న్ నిషేధిత జాబితా నుంచి విముక్తి క‌ల్పించాల‌ని బిల్డ‌ర్లు మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను అభ్య‌ర్థించారు. గ‌త రెండు వారాల కింద‌ట నుంచి ఉప్ప‌ల్‌, నార‌ప‌ల్లి, ఘ‌ట్‌కేస‌ర్ స‌బ్ రిజిస్ట్రార్ల ప‌రిధిలో ప్రైవేటు భూములు, ప్లాట్లు రిజిస్ట్రేష‌న్ కావ‌డం లేద‌ని క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. ఏవీ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ, పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ మాజీ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి, ఉప్ప‌ల్ బిల్డ‌ర్స్ అసోసియోష‌న్ అధ్య‌క్షులు ఆకుల స‌త్య‌నార‌య‌ణ ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం బోడుప్ప‌ల్‌, ఘ‌ట్కేస‌ర్ మున్సిప‌ల్ స‌ర్కిల్స్ ప‌రిధిలోని రియాల్ట‌ర్లు, బిల్డ‌ర్లు, బ‌య్య‌ర్లు, వివిధ కాల‌నీల ప్ర‌తినిధులు అంతాయిప‌ల్లిలోని క‌లెక్ట‌ర్ కార్యాయ‌లంలో మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి రిజిస్ట్రేష‌న్ల స‌మ‌స్య‌ల‌పై మొరపెట్టుకున్నారు.

క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన వారిలో..

ఒక స‌ర్వే నెంబ‌ర్‌లోని కొంత విస్తీర్ణం మాత్ర‌మే ప్ర‌భుత్వ భూమిగా న‌మోదై ఉన్న‌ప్ప‌టికీ ఆ స‌ర్వే నెంబ‌ర్‌లోని మొత్తం భూ విస్తీర్ణంను 22-ఏ లో చేర్చ‌డం వ‌ల‌న ప‌ట్టాదారులు, రియాల్ట‌ర్లు, బిల్డ‌ర్లు, బ‌య్య‌ర్లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని క‌లెక్ట‌ర్ ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ భూముల‌ను, ఆస్తుల‌ను కాపాడుతూనే త‌మ‌కు చెందిన ప్రైవేటు భూముల‌ను రిజిస్ట్రేష‌న్ నిషేధిత జాబితా నుంచి విముక్తి క‌ల్పించాల‌ని క‌లెక్ట‌ర్‌ను కోరారు. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పిందిస్తూ.. త్వరలోనే సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామి ఇచ్చినట్లు ఏవీ కన్ స్ట్రక్షన్స్ ఎండీ ,మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన వారిలో బోడుప్ప‌ల్ మాజీ డిప్యూటీ మేయ‌ర్ కొత్త ర‌విగౌడ్‌, పోచారం మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ కొండ‌ల్ రెడ్డి, మాజీ కార్పోరేట‌ర్ దొంతిరి హ‌రిశంక‌ర్ రెడ్డి, ఉప్ప‌ల్ బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సామ స‌తీష్ రెడ్డి, బిల్డ‌ర్లు ర‌మేష్‌, జ‌నార్ధన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, బాల్‌రెడ్డి, అరూణ్‌, న‌ర్సింహ్మారెడ్డి, కోనేటి వెంక‌ట్‌, యాసారం శ్రీనివాస్‌, మునికుంట కిర‌ణ్ గౌడ్‌, అశోక్‌, శ్రీకాంత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story