విజయవాడ థార్ వార్ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు

by Vemula.Srinu Prasad |

విజయవాడలో అర్ధరాత్రి సమయంలో థార్ జీపులతో నడిరోడ్డుపై ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లిన నిందితులు బొల్లా ఓం, లింగమనేని రోహిత్‌కు బెయిల్ మంజూరు అయింది..

విజయవాడ థార్ వార్ కేసు.. నిందితులకు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో అర్ధరాత్రి సమయంలో థార్ జీపుల(Thar Zeeps)తో నడిరోడ్డుపై ఇద్దరు యువకులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్‌కు వెళ్లిన నిందితులు బొల్లా ఓం, లింగమనేని రోహిత్‌కు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో బొల్లా ఓం ఏ1 కాగా లింగమనేని రోహిత్ ఏ2గా ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో థార్ జీపులతో ఢీకొట్టుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటన విజయవాడలో సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టడంతో బొల్లా ఓంతో పాటు లింగమనేని రోహిత్‌కు రిమాండ్ విధించింది. దీంతో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బొల్లా ఓం, లింగమనేని రోహిత్ జైలు నుంచి విడుదల కానున్నారు.

Next Story